చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.