
N. Giridhar Reddy
శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి…
▪శ్రీ.సీతా రామచంద్రుల స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా చల్లగా ఉండాలి…
– యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్. నేటి ధాత్రి:
శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం రోజున జహీరాబాద్ పట్టణంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…దేశ స్థాయిలో శ్రీరామ నవమి వేడుకలను ఆనందాల మధ్య సంతోషలు నింపుకొని భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో గొప్పతనం అని ప్రజలు నిండుగా అభివృద్ధి చెందాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సితా రామచంద్రస్వామి వారి దీవెనలతో జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాను అన్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మాజీ వైస్ యం.పి.పి.వి.రాములు,జహీరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,ఖాసీంపూర్ మాజీ యం.పి.టి.సి రాజు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి,అక్తర్ గోరి,బి.మల్లికార్జున్, ప్రజలు,భక్తులు,వివిధ సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.