పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను.!

Kalyana Lakshmi.

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే మంజూరు చేయాలి.

మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి

నాగారం నేటిదాద్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే పేద ప్రజలకు మళ్లీ అందించాల్సిందిగా కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ పరిధిలో 80 చెక్కులు మరియు కీసర ఆర్డీవో డివిజన్ పరిధిలో సుమారు 2000 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల ఇరువురి పార్టీల సమన్వయలోపం వల్ల చెక్కుల పంపిణీ సమయానికి మంజూరు చేయకపోవడంతో ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ఆర్డీవో గారికి తెలియజేశారు
ఈ విషయంపై ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఎమ్మార్వోలకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బుద్దవరం లక్ష్మీ, మరియు నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!