ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన
• మండల ఎంపీడీఓ రాజిరెడ్డి
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పై అధిక డబ్బు వెక్షించి అప్పుల పాలు కావద్దని మండల ఎంపీడీఓ రాజీరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు… ప్రజలు ఇండ్లకు అధిక డబ్బు పెట్టి అప్పులపాలు కావద్దని ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులతో ఇండ్లను నిర్మించుకోవలన్నారు. గ్రామంలో 16 ఇండ్ల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఏపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు జీవన్ రెడ్డీ, పిట్ల నర్సయ్య, భూపతి రెడ్డీ, మల్లేశం గౌడ్, ఏనుగంటి పోచయ్య, మమ్మద్ షాయదా, మ్యాదరి రజిత లు ఉన్నారు.