ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి
గౌడ సంఘం అధ్యక్షుడు మాదాసు రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బుధవారం కల్లుగీత కార్మిక సొసైటీ ఆవరణలో మాదాసు రవి గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు జయశంకర్ జిల్లా కేజీ కేఎస్ అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు మన పాపన్న గౌడ్ బహుజనుడు పూర్వంలో తురుష్క సైనికులు కల్లు మండవ లో పాపన్న స్నేహితుని కాలుతో తన్నబోయేది చూసి కోపంతో సైనికుల్ని మార్ కత్తితో మేడ నరికినాడు అప్పటి నుండి రాజ్యం లో విప్లవకారుడు అయ్యాడు పాపన్న పేరు జనగామ ప్రదేశములో మారుమోగింది యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు అతి తొందర్లోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమకూర్చారు 1675 సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గౌడ సంగం జిల్లా నాయకులు ల్యాదళ్ల సమ్మయ్య గౌడ్ గుర్రం తిరుపతి గౌడ్ పాలకవర్గ ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు మాజీ సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు