నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.
ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.
ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.
అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.

ఇది హాన్సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.
ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.