43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చట్కూరి నారగౌడ్ ఆధ్వర్యంలో 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు జరిపారు. తదనంతరం నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాల చేసి తెదేపా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సూర్య నాయక్ హాజరై రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యాప్తంగా పటిష్టం చేయడానికి నూతన కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. స్థానిక సంస్థల్లో తెదేపా పార్టీ నుండి ఫోటిలో ఉండబోతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రహ్లాద, బందారపు మల్లారెడ్డి, లింగాల దాసు, కట్టెల బాలయ్య, లచ్చ గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.