
Municipal Commissioner Srinivas
ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ ప్రజలకు శుభవార్త
ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు బకాయి పడినటువంటి ఆస్తి పన్ను పై 90% వడ్డీని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
వన్ టైం సెటిల్మెంట్ (ఓ.టి.ఎస్) పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు గల ఆస్తి పన్ను బకాయిలపై గల వడ్డీనీ 90% వరకు మినహాయింపు ఇవ్వడం జరిగినది కేవలము ఆస్తి పన్ను వడ్డీలో కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లించి వారి యొక్క బకాయిలను పూర్తి చేసుకోవచ్చు, కావున భూపాలపల్లి పట్టణ ప్రజలు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని మునిసిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ పట్టణ ప్రజలను కోరినారు ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన యజమానులకు వారికి వారి యొక్క వడ్డీ రాయితీ భవిష్యత్తు చెల్లింపులతో సర్దుబాటు చేస్తారు కావున పట్టణ సద్వినియోగం చేసుకోవాలి