బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం
#నెక్కొండ ,నేటి ధాత్రి:
మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.