
Young people should not be fooled by betting apps.
బెట్టింగ్ యాప్ లకు యువకులు మోగ్గు చూపకండి
కరకగూడెం ఎస్సై రాజేందర్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
యువత ఈజీ డబ్బులకు అలవాటు పడి బెట్టింగ్ లకు మొగ్గచూపకుడదని,బెట్టింగ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతను,ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపియల్ క్రికెట్ వెల విపరీతంగా డబ్బులు చేతులు మారుతున్నాయి ఎవ్వరూ ఒక్కరు బెట్టింగ్ లో డబ్బులు గెలుచుకున్నారు అనే వెర్రితనంతో మీరు అ వలలో చిక్కుకోకండి అని అయన తెలిపారు. అలాగె బెట్టింగ్ యాప్స్,ఆన్లైన్ బెట్టింగ్ అడి ఎంతోమంది యువత ప్రణాలు పోగోట్టుకోవడం మనం చూస్తునే ఉన్నాం ఇటువంటి సంఘటనలు మన మండల పరిధిలో జరగకుండా చూడవలసిన భాద్యత మన అందిరిపై ఉందని ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పై ఎక్కువగా ఉందని పిల్లల అవసరాలకు మించి డబ్బులు ఇవ్వకుడాదని అయన తెలిపారు.ఈ బెట్టింగ్ మహమ్మారి వలలో చిక్కుకోని ఎన్నో కుటుంబాలు రొడ్డున్న పడ్డాయని అయన గుర్తుచేశారు.