`ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రి ‘‘పొంగులేటి’’ పట్టుదలతో ఉన్నారు
`ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు తయారు చేస్తున్నారు
`మంత్రి ‘‘శ్రీనివాస్ రెడ్డి’’ గట్టిగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కృషి చేస్తున్నారు
`అనుకున్న మేరుకు నాలుగేళ్లలో 20 లక్షలు ఇస్తే కాంగ్రెస్‌కు ఎదురుండదు
`మరో పదేళ్లు కాంగ్రెస్ పాలనను జనం వదులుకోరు
`పదేళ్ల కల తీరితే బిఆర్‌ఎస్ గురించే ప్రజలు ఆలోచించరు
`గత ప్రభుత్వం పదేళ్లలలో డబుల్ బెడ్ రూంలు ఇచ్చింది లేదు
`ఇస్తామని చెప్పి రెండు సార్లు బిఆర్‌ఎస్ మోసం చేసింది
`అందుకే ప్రజలు బిఆర్‌ఎస్ ను ఓడిరచింది
`కాంగ్రెస్ మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది
`గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన అనుభవం కాంగ్రెస్‌కు వుంది
`పదేళ్ల పాటు అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఇచ్చింది
`బిఆర్‌ఎస్ ఇస్తామని చెప్పి, పదేళ్లు మోసం చేసింది
`ఆ ప్రభావం బిఆర్‌ఎస్ మీద పడడం జరిగింది
`కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే చాలు తిరుగులేని శక్తిగా మారుతుంది
`కూడు, గూడు కల్పిస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు
`అక్కడక్కడా నిర్మాణాలు చేసి బిఆర్‌ఎస్ ఓట్లు పొందింది
`ఆ నిర్మాణాలను చూపించారే గాని బిఆర్‌ఎస్ ఇచ్చింది లేదు
`అప్పుటి నుంచి పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు
`ప్రజా ప్రభుత్వం మీద పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
`నాలుగేళ్లలో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇస్తే కాంగ్రెస్ కు తిరుగుండదు
`తెలంగాణ లో ఇతర పార్టీలకు ఆదరణ వుండదు
`ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కారు వైపు కన్నెత్తి కూడా చూడరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సొంతింటి కల నెరవేరే సమయం వచ్చేసింది. ఉగాదికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చట్టనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుచేస్తోంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చింది. ఆ హమీ అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంత కాలంగా ఈ కార్యక్రమం అమలు మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా సుమారు 20లక్షల ఇండ్లు ఈ నాలుగేళ్లకాలంలో పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో ఈ ఏడాది మొదటి విడుతగా సుమారు 5లక్షల ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుదలతో వున్నారు. అందుకు అవసరమైన ఇండ్ల పంట్టాలను యుద్ద ప్రాతిపదికన తయారు చేస్తున్నారు. ఉగాదికి ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి చొరవతో అధికారులు కూడా చకచకా ఆ పనులు పూర్తి చేస్తున్నారు. అనుకున్న మేరకు ఈ ఏడాది ఎట్టిపరిస్ధితుల్లో 5లక్షల ఇండ్లు పేదలకు పంచి వారి కళ్లలలో ఆనందం చూడాలనుకుంటున్నారు. వారికి ఇచ్చిన హమీని మొదటి దఫాలోనే నెరవేర్చి వారి ఆశలను నెరవేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అర్హులందిరకీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా సాగేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీమీద ప్రజలకు అంచెంచలమైన విశ్వాసం. పదేళ్లుగా పేదలు ఇందిరమ్మ ఇండ్లకోసం ఎదురుచూస్తున్నారు. 2005 నుంచి 2014 వరకు 25లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సర్కారు నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు ఇస్తామంటోంది. నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కాంగ్రెస్‌కు తిరుగుండదు. తెలంగాణలో ఇతర పార్టీలు రాజకీయమే వుండదు. రేవంత్ సర్కారు నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నది. ఈ ఏడాది సుమారు 5లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 5లక్షల ఇండ్లు నిర్మాణమైతే కాంగ్రెస్‌కు తిరుగుండదు. పల్లెల్లో ఇతర పార్టీల జెండాలే కనిపించవు. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు కల. ఆ కలను ఆది నుంచి నెవరేస్తున్న పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్. ఇందిరా గాంధీ హాయాం నుంచి మొదలు, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీలకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు, వాటితోపాటు తెట్టెతో నిర్మాణం చేసిన బావులు తవ్వించి, పేదలను ఆర్ధికంగా ఉన్నత స్దితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీలకు సాగు భూములు వుండేవి కాదు. దాంతో ఎస్సీలకు ప్రభుత్వ భూములను అందించారు. ఆ భూములను సాగు యోగ్యం చేసేందుకు సహకారమందించారు. సాగు నీటికి అవసరమైన బావులను పెద్దఎత్తున తవ్వించి ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణలో ప్రతి గ్రామంలో వ్యవసాయ భూముల వద్ద రాతి కట్టడంతో కూడాని తెట్టె నిర్మాణం చేసిన బావులే ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత బిసిలకు బలహీన వర్గాల గృహ సముదాయాల పేరుతో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పెద్దఎత్తున పేదలకు అందజేసింది. ఉమ్మడిరాష్ట్రంలో సుమారు 45లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. అప్పుడు ఎస్సీ, ఎస్సీ, బిసి , ఓసి అని తేడాలు లేకుండా ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో సుమారు 25లక్షలు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లు కనీసం 500 వరకు వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపధకం ద్వారా తెలంగాణ మొత్తం సుమారు 25 లక్షల మంది పేదలు ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు అందించేందుకు బృహత్తర ప్రణాళిలను రచిస్తోంది. తెలంగాణలో ఇల్లు లేదన్న పేద వారు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. గతంలో ఇల్లు కావాలన్న ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అవి ఇప్పుడు పల్లెల్లో మరో గ్రామంగా, పట్టణాలలో పెద్ద పెద్ద కాలనీగా అవతరించాయి. అంత గొప్పగా ఆ పధకాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పడకల గదులు ఇండ్ల నిర్మాణం పేరు చెప్పి ప్రజలను వంచించిన ఘనత బిఆర్‌ఎస్‌ది. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను ఎద్దేవా చేస్తూ వాటిని అగ్గిపెట్టెలంటూ హేళన చేసి బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల స్ధానంలో ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ ఇంటిని నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చి కేసిఆర్ అధికారంలోకి వచ్చాడు. ఒకటి కాదు, రెండుసార్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క తెలంగాణ పల్లెలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. పేదలకు ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డిని ప్రజలు బలంగా విశ్వసించారు. ఆయన నాయకత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు ఐదేళ్ల కాలంలో కనీసం 20లక్షల ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఏటా కనీసం 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వనున్నారు. అందుకు అవసరమైననిధులను కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ నిర్మాణం మొదలు కానున్నది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామని హమీ ఇచ్చారు. ఆ ప్రజా విజయోత్సవాలలో ఇండ్ల ధరఖాస్తులుకూడా ప్రజల నుంచి స్వీకరిం చారు. వాటి ఆధారంగా ఎంపిక ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. పల్లెల్లో గాని,పట్ణణాలలో గాని స్ధలం వున్న వారికి రూ.5లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్ధలాలను గుర్తించి, ఇండ్ల పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లునిర్మాణం చేసిఇస్తారు. ఇటీవల జరిగిన సమగ్ర సర్వేతో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. దాంతో తెలంగాణ లో ఎంత మందికి ఇండ్లు అవసరపడతాయో తెలుతుంది. అయితే ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వడానికి ప్రణాళికలు కూడా సిద్దమయ్యాయి. దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేసింది. ముందుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరు చేశారు. ఇలా దశల వారిగా ప్రతి నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు నిర్మాణంచేసి ఇస్తారు. పట్టణాలలో అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తారు. అందుకు అసవరమైన మోడళ్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ప్రభుత్వమే పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు పంచే కార్యక్రమం మొదలు కాకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోపు సుమారు 450000 ఇండ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా వుంది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో దానికి అంకురార్పన జరగుతోంది. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది ధరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడ ఏడాదికి సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వచ్చే ఇవరై ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. కాంగ్రెస్‌ను కాదని ఏ ఇతర పార్టీని ప్రజలు ఆదరించరు.