ఓటర్ల జాబిత ఫారంల సవరణ పై పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన ఆర్డీఓ డాక్టర్.కె.నారాయణ
ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
పరకాల నేటిధాత్రి;
104 పరకాల నియోజకవర్గ ఓటర్ల జాబితా ఫారం 6,7,8ల సవరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని పరకాల ఆర్డీవో కె. నారాయణ నిర్వహించారు. మంగళవారం పట్టణలోని ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.ఓటర్ల జాబితాలో నూతన,ఓటర్ల మార్పుచేర్పులు,ఒక నియోజకవర్గంలో నుంచి మరొక నియోజకవర్గ మార్పులు చేర్పులు,చిరునామా మార్పిడి దరఖాస్తు చేసుకునే విధంగా బిఎల్వోల వద్దనమోదు చేసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్డీవో కోరారు.గత ఎలక్షన్ లో పోటి చేసిన అభ్యర్దుల యొక్క వ్యయ నివేదికలకు సంబంధించిన వివరాలు తెలిపి వాటిలో ఉన్న అభ్యర్దుల ఖాతాల ప్రకారంగా అన్నింటినీ లెక్కలను తెలియచేసారు.బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను ఇవ్వాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు తెలియజేయడంతో పాటు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ ఓటర్ నమోదు అధికారి,పరకాల తోట విజయలక్ష్మి,ఎన్నికల విభాగం నాయబ్ తహసిల్దార్ జి.సూర్య ప్రకాష్,ఎన్నికల సీనియర్ సహాయకులు ఎస్ భద్రయ్య , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.