సిరిసిల్ల జిల్లాలోని బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలో ని మున్నూరు కాపు భవన్ లో
భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో

సిరిసిల్ల జిల్లా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అనంతరం నూతనంగా సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిగ నియమింపబడ్డ రెడ్డబోయిన గోపికి సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ… రాబోయేవి ఎన్నికలే,స్థానిక ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మనదని,బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటదో మీకు తెలుసునని, సెస్, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఫైట్ చేసినమో మీకు తెలుసు,సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే,భయపెట్టి బెదిరించి బీఆర్ఎస్ గెలిచినట్లు అరాచకాలు చేసిన దుర్మార్గమైన చరిత్ర బీఆర్ఎస్ దే అని,ఎవరెన్ని చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని,ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే అని బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన అధ్యక్షులు బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు యువకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.