ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

Class 10 exams begin on the 21st of this month

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత సంవత్సరంలో పదో తరగతిలో వచ్చిన ఫలితాలు కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న విద్యా సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు అందరము కృషి చేస్తున్నాము. ఈనెల 21వ తేదీ నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలకు ఎలా సంసిద్ధులు కావాలో, దీనికి జిల్లా విద్యాశాఖ ఏ చర్యలు చేపడుతున్నారు అన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్ద మల్ల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ మొదటివారం నుండి ఉదయం సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3449 మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో1724- బాలికలు మరియు1725- బాలురు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీరి కోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిని అమలుపరచినట్లయితే మంచి ఫలితాలను మనం పొందవచ్చు అనే నినాదంతో మనం ముందుకు వెళ్లడం జరుగుతుంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సమక్షంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 2025 పై సమీక్ష సమావేశం చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ అధికారులకు వార్షిక పరీక్షలకు సంబంధించిన అన్ని విభాగాలతో పరీక్ష నిర్వహణ కొరకు సమావేశమును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉత్తీర్ణత శాతము పెంచడం కోసం విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు పరీక్ష భయాన్ని తొలగించుటకు మోడల్ ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా విద్యార్థులకు స్నాక్స్ ప్రత్యేక తరగతి సమయంలో అందించబడుతుంది. ఒంటి పూట బడి సమయంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు అభ్యసన దీపికలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేస్తున్నాం. విద్యార్థులు ఉదయం లేచి చదువుకునేలా సంబంధిత ఉపాధ్యాయుల చే వేకప్ కాల్స్ చేపిస్తున్నాం. పర్యవేక్షణ అధికారులతో జిల్లాలోని అన్ని పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి తగు సూచనలను ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. సమిష్టి కృషితో సత్ఫలితాలను సాధించే దిశగా పనిచేస్తున్నాం. ఇంటి వద్ద పిల్లలను వారి తల్లిదండ్రులు చదివించే విధంగా వారిని చైతన్య పరుస్తున్నాం. గణితం, భౌతిక రసాయన శాస్త్రం ఇంగ్లీష్ వంటి కఠిన సబ్జెక్టులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు పరీక్ష భయాన్ని వీడడం కోసం గత మాదిరి ప్రశ్న పత్రాలను అభ్యాసం చేపిస్తున్నాం. పట చిత్రాల గీయడం, మ్యాప్ పాయింటింగ్ వంటి అంశాలపై విద్యార్థులను దృష్టి కేంద్రీకరించేలా చేపిస్తున్నాం. విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో అనవసరమైన ఒత్తిడికి గురికాకూడదు. పరీక్షల సమయంలో ఆహారము, నిద్ర, వ్యాయామానికి తగిన ప్రాధాన్యతనిస్తుండాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఖచ్చితంగా 7 నుండి 8 గంటల సమయం కేటాయించాలి. ఒక గంట సమయం చదివిన తర్వాత మెదడుకు ఐదు నిమిషాల విరామం ఇవ్వడం ద్వారా తిరిగి ఉత్సాహంతో చదవగలుగుతారు. టీవీ, మొబైల్స్, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలి. పరీక్ష అంటే జీవితానికి అగ్నిపరీక్ష కాదు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని నిరుత్సాహపడకుండా మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. పరీక్షలను బాధ్యతతో రాయాలి కానీ భయంతో కాదు కావున జిల్లాలోని పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రణాళికతో మంచి ఫలితాన్ని సాధిస్తారని ఆశిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జయశంకర్ భూపాలపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!