పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి..
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, పెన్నులను అందించరు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఈ సమయంలో చదువు పట్ల ఎవ్వరు అశ్రద్ధ చేయరాదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డం లత భాస్కర్, బి. ఆర్. ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పాల్గొన్నారు.
పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.
