రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో ఆది జగద్గురు రేణుక చార్యుల జయంతి సందర్భంగా శ్రీ రేవణసిద్దేశ్వర దేవాలయంలో ఉదయం ధ్వజారోహణం గణపతి పూజ స్వస్తి పుణ్యా వచనము శ్రీ రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము బిల్వార్చన పూజ మహా మంగళహారతి నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాతృశ్రీ మఠం శివలీలమ్మ రాచయ్య స్వామి మరియు తాజా మాజీ సర్పంచ్ బసవరాజ్ పటేల్ నాగేష్ పాటిల్ నాగరాజ్ పటేల్ లింగం గౌడ్ పండరినాథ్ రాజేశ్వర్ నవీన్ కుమార్ వెంకట సాయి సమస్త భక్తులు పాల్గొన్నారు. మరియు వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది పడకుండా అన్నదాన నీటి సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని కార్యక్రమలు నిర్వహించడం జరిగింది.