సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి
ఇర్ప రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు*
నేటి ధాత్రి ; భద్రాచలం;
ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదివాసీ మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ లను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మార్చి 11,2025; మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఆదివాసీ ప్రజల ఉపాధిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంప్ లను నిలిపి పాలకులు రైజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు.నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ కు పెట్టుబడి నిమిత్తం ముందస్తు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమ్మ పెట్టదు అడుక్కతీననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు.ఇసుక అక్రమాలు కట్టడి అంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొకోక పోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని అన్నారు