ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి ;
ఆనాటి కాలంలో ఎవరికి ఏమి తెలియని వారికి విద్య ద్వారా అందరినీ చైతన్య వంతులను చేయాలని ముందుగా స్త్రీల విద్యాభివృద్ధికి మరియు వారి హక్కుల కోసం ఎంతో కృషి చేసిన తొలి ఉద్యమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారూ,చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే వర్ధంతి*వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజలు అమాయకత్వం తో బానీసలుగా బ్రతుకులు బ్రతుకుతున్న వారిని చూసి విద్యి ద్వారా చైతన్య వంతులను చేయాలని పట్టుదలతో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీల తో పాటు ప్రజలందరికి విద్యను అందించిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు. మహిళల తో పాటు ప్రజల హక్కుల కోసం ఎదురించి అలుపెరుగని పోరాటం చేసిన ఉద్రమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలిపారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేసిందని తెలిపారు. ఆమె చేసిన సేవలు మరువలేనివని స్త్రీలతో పాటు ప్రజలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ పాముకుంట్ల చందర్ శీలపాక ప్రణిత్ దాసారపు సాంబయ్య మహిళలు పాల్గొన్నారు.