ఝరసంగం: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరసంగం లోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ ఆదివారం తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల సంఘటన్ (కేవీఎస్) 2025-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బాల్వాటిక-1, 2, 3 (ప్రీ ప్రైమరీ)తో పాటు, ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. బాల్వా టికా క్యాటగిరీ తప్ప మిగిలిన తరగతుల సీట్లను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. భద్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అలాగే ఏక సంతానంగా ఆడపిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. దర ఖాస్తుల దాఖలుకు ఈ నెల 21న చివరి తేదీ. ఆ తరువాత నాలుగైదు రోజుల్లో ఎంపికైన వి ద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. కేంద్రీయ విద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in/en/ వెబ్సైట్ చూడవచ్చు.