అంతర్జాతీయ మహిళా దినోత్సవం,ఘనంగా సన్మానించిన ఆర్టిఐ నేత వెంకటేశ్వర్లు గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా,గ్రామపంచాయతీ కార్యదర్శులు ,సుజాత
గుండ్ల కర్తి పంచాయతీ కార్యదర్శి మౌనిక,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కరుణ,మాజీ వార్డ్ మెంబర్ స్వరూప ఘనంగా శాలువాతో సన్మానించిన వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ
మనకు స్వాతంత్య్రం సిద్దించి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్న ఇంకను మహిళలకు రక్షణ కొరవడింది మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నమరోసారి మనం మహిళల సాధికారత, స్వేచ్చ,వారి హక్కులు,రక్షణ గురించి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈనాటికి కూడా మహిళలు పూర్తి స్థాయిలో స్వేచ్చ,వాయువులు పీల్చుకోలేక పోతున్నారు అనే మాట మనకు చాలా స్పష్టంగా అవుతుందని
ఎందుకంటే ఈనాటికి మహిళలు అనేక విధాలుగా గృహ హింస, లైంగిక దాడులు,భృణ హత్యలు, అత్యాచారాలు,పురిటిలోనే పసిపాపలను కడతెర్చడం,లింగ సమానత్వం వంటి విషయాల్లో తీవ్రస్థాయిలో అధిపత్య ధోరణి, దౌర్జన్యాలను,అమానుష ఘటనలను నిత్యం ఎదుర్కొంటుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంతదురదృష్టకరం.ముఖ్యంగా చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత 30 శాతానికి మించక పోవడం కూడా మహిళల పాలిట ఓ,శాపంగా పరిణమించి వారి ప్రశ్నించే గొంతుకకు కళ్లెం వేసినట్లయింది,అయినప్పటికీ మహిళలు ఈ మధ్యకాలంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతున్నారు స్త్రీలేకపోతేజనం లేదు, శ్రీ,లేకపోతే గమనం లేదు , శ్రీ,లేకపోతే అసలు సృష్టి లేదు కంటిపాపల కాపాడే శ్రీ మూర్తికి మహిళల హక్కులను వర్ధిల్లాలని నారీ శక్తిమణులు మహిళలకు వందనాలు,తెలుగు రాష్ట్రాల మహిళా మణులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టిఐ, సభ్యుడు రమేష్, ఎంఈఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు,
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా.
