మహిళలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాలి.

Women's Day
మహిళలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాలి
ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం సాధించాలి
*ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదగాలి..
*ప్రభుత్వ పథకాలలో మహిళలకు పెద్ద పీట..
*ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుంది..
*మహిళా దినోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్..
*రూ.10.58 కోట్ల చెక్కు పంపిణి..
పలమనేరు(నేటి ధాత్రి)మార్చి 08:
మహిళలు మరింత చైతన్యవంతులుగా రాణించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
మొట్ట మొదట మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి నాడు బీజం వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీనేనన్నారు. 
Women's Day
Women’s Day
మహిళలను ఆర్థికంగా రాణించడానికి దేశంలోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని,మహిళలకు రాజకీయ హక్కు కల్పించి 33% రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థలందు అవకాశం కల్పించిన ఘనత కూడా టీడీపీదేనన్నారు. 
బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మహిళల వెంట నేడు క్యూ కడుతున్నాయంటే అందుకు మీరు కల్పించుకున్న నమ్మకమే కారణమని అన్నారు,
మహిళలు వంటింటిలో పడుతున్న బాధలు చూసి వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు అని ఇప్పుడు దీపం-2 ద్వారా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తు చేశారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి,ఏపి ఎల్,ఎల్,సి,
ద్వారా భూమిని సగం ధరకే ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మహిళలు తమ స్వశక్తితో రాణించడానికి టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తూ వారికి ఉచితంగా కుట్టు మిషన్లు  ఇస్తూ అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సరళమైన విధానాలతో అన్ని రకాల ప్రోత్సాహకాలు,సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందిస్తోందని,తల్లికి వందనం పేరుతో ప్రతిబిడ్డకు  చదువుకోవడానికి 15000/- రూపాయలు త్వరలో చెల్లిస్తుందని పేర్కొన్నారు. 
ప్రభుత్వ పథకాలన్నీ మహిళలకు అందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలా అన్ని ప్రభుత్వ పథకాలల్లో మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని కోరారు. అనంతరం పట్టణ స్వయం సహాయక సంఘలకు రూ.10.58 కోట్ల మెగా చెక్ ను అందజేశారు. తదనంతరం పలువురు వివిధ రంగాలల్లో రాణించిన మహిళలను ఆయన సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమాల్లో పలమనేరు బాలాజీ కో ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ,మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి, మెప్మా మేనేజర్ బాబా లతో పాటు కౌన్సిలర్లు సునీతా నాగరాజు, కిరణ్, బీ ఆర్ సీ కుమార్ మరియు టీడీపీ నాయకులు ఆర్ బిసి
కుట్టి,గిరిబాబు,మదన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!