పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి :
మండల ప్రజా పరిషత్ పరకాల కార్యాలయములో అంతార్జీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఎదుగుతున్నారని అయినప్పటికీ కుటుంబంలో ఎవరి పాత్ర వారు పోషించినప్పుడే సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ యన్. శ్రీలత,సూపరిండెంట్ సిహెచ్ శైలశ్రీ,ఈ టెక్నికల్ అసిస్టెంట్ సుమలత,పంచాయతీ కార్యదర్శులు బి.సుమలత , మహ్మద్ రిజ్వానా,కంప్యూటర్ ఆపరేటర్ అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల,ఈసీ రజనీకాంత్ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.