భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు..
రామాయంపేట:నేటి ధాత్రి (మెదక్)

బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చికెన్ తినే ప్రియులంతా సతమతమవు తున్నారు. మన పక్క రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడం కోళ్లు చనిపోవడంతో మన రాష్ట్రంలో చికెన్ తినాలంటేనే ప్రజలు జంకుతున్నారు. సాధారణంగా చికెన్లు లభించే విభిన్న రకాల ఐటమ్స్ మరి ఇతర వాటిలో లభించకపోవడం తెలిసిందే కావున మాంసం ప్రియులకు చికెన్ తిని ప్రీతిపాత్రమైనది గత 10 రోజులుగా చికెన్ తినాలంటే జనం జంకుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనలేని పరిస్థితి లో ఉన్నారని చెప్పవచ్చు బ్లడ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో పౌల్ట్రీ యజమానులు. చికెన్ సెంటర్ యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామాయంపేట నిజాంపేట నార్సింగ్ మండలాల్లోనీ చికెన్ మరియు కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఇష్టపడడం లేదు. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాలలో చికెన్ షాపులు మూతపడుతున్నాయి. అదేవిధంగా కోడిగుడ్లు తినాలనుకున్న ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చికెన్ కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 240 పలికిన చికెన్ నేడు 150 రూపాయలు కాగా 7 రూపాయలు అమ్మిన కోడిగుడ్లు 5
రూపాయలకు తగ్గుముఖం పట్టాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించక పోయినప్పటికీ పక్క రాష్ట్రాలలో ఈ ప్రభావం ఉండటం వలన ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉన్నందువలన ఆ ప్రాంతం వారు చెప్పిన మాటలకు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడానికి ఇష్టపడతారు. బంధువులు మిత్రులు వచ్చిన ఫ్రెండ్స్ కలిసిన పార్టీ చేసుకోవాలన్నా ఆదివారం నాడు చికెన్ ఉండాల్సిందే. బర్డ్
ఫ్లూ వ్యాధి కారణంగా చికెన్ తింటే ఏమి అవుతుందో అనే భయంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
భారీగా పెరిగిన మటన్ ధర రూ.కిలో 800..

చికెన్ సమస్య కారణంగా మటన్ ధర ఒక్కసారిగా కొండెక్కి కూర్చునట్లుగా ఉంది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినకపోవడం వలన మటన్ అమ్మే మాంసం దారులు కిలో ధర 700 నుండి 800 రూపాయలకు అమాంతం 100 రూపాయలు పెంచారు. 200 రూపాయలకు అమ్మే చేపలు అమాంతం 300కు పెరిగిపోయాయి. చికెన్ తినకపోవడం ను ఆసరాగా తీసుకొని మటన్ అమ్మే యజమానులు అధిక ధరలను పెంచి విక్రయాలు చేపడుతున్నారు. ఈ విషయంలో చాలామంది కొనలేని దుస్థితిలో తినలేని పరిస్థితిలో ఉన్నారు. అటు చికెన్ తినలేక అధిక ధర పెట్టి మటన్ కొనలేక మాంసం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచి చెడు అన్ని రకాల మేకలను కోస్తూ మాంసం విక్రయిస్తున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.