అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయండి
20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్.
నేటిధాత్రి కాశీబుగ్గ
అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున హైదారాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అఖిల భారత పద్మశాలి 17వ మహాసభకు, వరంగల్ లోని ప్రతి పద్మశాలి ఇంటి నుండి ప్రతి ఒక్కరు భారీగా తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని వరంగల్ అఖిల భారత పద్మశాలి పట్టణ గౌరవ అధ్యక్షులు, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ పద్మశాలి కులస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అఖిలభారత పట్టణ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు, 20వ డివిజన్ అఖిల భారత సేవా సంఘం అధ్యక్షులు గంజి సాంబయ్య, బొద్దుల కుమార్, 20వ డివిజన్ అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు ములుక సురేష్, 19వ డివిజన్ అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు క్యాతం రంజిత్, మార్త ఆంజనేయులు, కుసుమ సారంగపాణి, వేముల నాగరాజు, వంగరి రవి, రంగు శ్రీధర్, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, గూడూరు కృష్ణ, కుందారపు గోపి, బొప్పరాతి నగేష్, మార్త జగన్, క్యాతం రవీందర్, క్యాతం శ్రీనివాస్, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు,