గోపి కుటుంబాన్ని పరామర్శించిన సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ
ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వఆసుపత్రి సిబ్బంది
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.గోపి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది.అనంతరం భాదిత కుటుంబానికి 20,000ల ఆర్థిక సాహయాన్ని అందజేశారు.అనంతరం సూపరిండెంట్,ఆర్ఎంఓ లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ చనిపోవడం చాలా బాధాకరమని గోపి కుటుంబానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.