ఇ విజయం తాత్కాలికమే
`బీఆర్ఎస్, బీజేపీ చీకటి రాజకీయలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం
`రాబోయో ఎన్నికలల్లో గెలిచేంది కాంగ్రెస్సే
`వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వర్దన్నపేట,నేటిదాత్రి:
వర్ధన్నపేట మండల కేంద్రము లో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యువేట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం బీజేపీ, బిఆర్ఎస్ చీకటి రాజకీయలతోనే జరిగింది.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదని గత పదేళ్ళలో బీఆర్ఎస్ చేసిన అడ్డగోలు అవినీతి తో కేసీఆర్ కుటుంబం అనేక కేసులలో కీలకంగా ఉన్నారని దీంతో క్విడ్ ప్రో కో పద్ధతిన బిఆర్ఎస్ బీజేపీ లు వారి వారి లాభాల కోసం పని చేస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే ఈ ఒప్పందాలు అమలు అవుతున్నాయి . పార్లమెంట్ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పూర్తిగా లోపాయకారి ఒప్పందం తో బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లనే బీజేపీ 8 సీట్లు గెలిచింది అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ 22 మంది ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్న కూడా పోటీకి దూరంగా ఉండి బీజేపీని గెలిపించింది. ఇది తాత్కాలిక విజయమే ఈ ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు ఏమి సంబంధం ఉండదని రాబోయో ఎన్నికలల్లో గెలిచేంది కాంగ్రెస్సే అని వెంకటయ్య అన్నారు.
ఇ విజయం తాత్కాలికమే.!
