గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి..
– పాడి పంటలతో బేతిగల్ గ్రామం విరసిల్లాలి..
– బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు.
వీణవంక, ( కరీంనగర్ జిల్లా ):
నేటి దాత్రి :వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి,మహలక్ష్మి,బొడ్రాయి,సహిత పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమపూజలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని,గ్రామంలోని ప్రజలందరూ పండగకు రావడం వలన గ్రామమంతా సందడిగా ఉందని అన్నారు.శ్రమ తీసుకుని ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ప్రతిష్ఠ మహోత్సవానికి తనవంతు సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బేతిగల్ గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు,వీణవంక మండల నాయకులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.