ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న మున్సిపల్ సిబ్బంది
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి పట్టణంలో తక్కువ మైక్రోన్ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు .ప్లా స్టిక్ కవర్లలో ఇడ్లీ సాంబార్ చాయి హోటల్ నిర్వాహకులు పార్శాల్ చేసి ఇవ్వడం వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాల విధిస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వనపర్తి పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు సుమన్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కిరాణా షాప్ లో వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు నిర్వహించి ఇబ్బందుల గురి చేయడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు నోటీసులు ఇచ్చి తనిఖీలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు . ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం 120 మైక్రోన్ కవర్లు వాడాలని కిరాణా షాప్ ల వారిని కోరారు
ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న.!
