
Commissioner
కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు
తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 05:
తిరుపతి లోని అక్కరంపల్లి ప్రజా సమస్య లపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య స్పందించారు. బుధవారం ఉదయం అక్కరంపల్లిని స్వయంగా సందర్శించిన కమిషనర్ కు ప్రజలు గోకులం అపార్ట్ మెంట్ పక్కన మురికి నీటి నిల్వను, మట్టి రోడ్ల దుస్థితిని, విపరీతమైన దోమల బాధను, దుర్వాసనను, మురికి నీటి కాల్వల దుస్థితిని వివరించారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంటనే స్పందించి మురికి నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన కమిషనర్ కు అకారంపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.