ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామ శివారులో గల ముల్తాని బాబా దర్గా పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు పడి మృతి చెందడం జరిగిందని జహీరాబాద్ రూరల్ వలయాధికారి జక్కుల హనుమంతు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో పడి మునిగిపోతున్న క్రమంలో అయువకుడిని రక్షించబోయి మరో వ్యక్తి బలయ్యా డు. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎస్ కే ఫహీమ్ వయస్సు 17 సంవత్సరాలు గల యువకుడు జహీరా బాద్ బీదర్ రోడ్డు పక్కనగల గంగ్వార్ శివారులోని ముల్తాని బాబా దర్గాను దర్శించుకునే క్రమంలో దర్గా సమీపంలో ఉన్న చెరువులో కాళ్లు చేతులు కడుక్కునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోతున్న క్రమంలో అదే మహారాష్ట్ర ప్రాం తానికి చెందిన ప్రాంతానికి చెందిన సంజయ్ కామడే 50 సంవత్సరాల వ్యక్తి ఆ యువకుడుని కాపాడే ప్రయత్నంలో నీటి లోతును అంచనా వేయడంలలో విఫలమై ఇద్దరు నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. ఇద్దరు మృతి చెందగా ఒకరి మృతదేహం లభించింది. మరోమృతదేహం కోసం పోలీసులు గాలి స్తున్నారు. సంఘటన సంభవించడ తెలుసుకుని దర్గా దగ్గర ఉన్న స్థానికులు, మహారాష్ట్ర లాతూర్ పట్టణం, పంచపూర్ కాలనీకి చెందిన పలువురు అక్కడికి చేరుకొని రక్షించే ప్రయత్నంలో ప్రమాదంలో చిక్కి మృత్యువాత పడ్డాడని తెలుసుకొని కుటుంబ సభ్యులు సంబం ధికుల అరుపులతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం తో నిండిపోయింది. సమాచారం అందుకు న్న జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు హద్నూర్ ఎస్సై రాజశేఖర్ తో కలిసి అక్కడికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి స్థానికుల సహాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంజయ్ కామిడే మృతదేహాన్ని వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల కుటుంబ సభ్యులు
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హద్నూర్ ఎస్ఐ. చెల్లా రాజశేఖర్
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు వివరాలు వెల్లడించారు.