-జాతీయ విద్యావిధానం`2020ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు
-ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నది కేవలం ఈ రాష్ట్రం మాత్రమే
-ఎన్‌ఈపీా2020 వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయి: స్టాలిన్
-హిందీని రుద్దే ఉద్దేశం లేదు: కేంద్రం
-త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్న భాజపా
-మిగిలిన అన్నిపార్టీలు ద్విభాషా విధానానికే మద్దతు
-విద్యను కూడా రాజకీయం చేసిన తమిళనాడు నేతలు
-కాలానికి అనుగుణంగా మారని నేతలు
-ముదిరిపోయిన ఓటుబ్యాంకు రాజకీయాలు
-మార్పు కోరుకోకపోతే ప్రజలకే నష్టం
హైదరాబాద్,నేటిధాత్రి:
వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమిళనాడులో వరుస వివాదాలతో రాజకీయ పార్టీలు ప్రజల్లో ఏదోవిధంగా తమ పలుకుబడిని పెంచుకోవాలని ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఫిబ్రవరి మొదటివారంలో తిరుపురన్ కుండ్రం ఆలయ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తే తాజాగా జాతీయ విద్యావిధానం`2020 కేంద్ర, రాష్ట్రాల మధ్య రగడను రాజేసింది. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ విధానం కింద త్రిభాషా సూత్రాన్ని అంగీకరించబోమని తమిళనాడు తెగేసి చెబుతోంది. హిందీని బలవంతంగా రుద్దడానికే కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆరోపిస్తోంది. అయితే కేంద్రం అటువంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. నిజానికి తమిళనాడు ప్రజల్లో భాషాదురభిమానాన్ని హిందీ వ్యతిరేకతను ప్రజల్లో బాగా రెచ్చగొట్టింది ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్ మరియు ద్రవిడవాద సిద్ధాంత కర్త పెరియార్. తమిళుల్లో హిందీ వ్యతిరేకతకు ప్రధాన కారణం, హిందీలో సంస్కృత పదాలు ఎక్కువగా వుండటం. తమిళులు సంస్కృతాన్ని ప్రాచీన భాషగా అంగీకరించరు. తమిళం మాత్రమే అతి ప్రాచీన భాషగా వారు పేర్కొంటారు. ఆర్యభాష అయిన హిందీని ద్రావిడులైన తమిళులపై రుద్దడం ద్వా రా ఆర్యులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఒప్పుకోబోమన్నది వారి వాదన. కానీ ఇక్కడ ఒక్క నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే తమిళనాడులో ఇప్పుడు హిందీని వ్యతిరేకిస్తు న్నారో వారి పిల్లలు చదివేది త్రిభాషా సూత్రాన్ని పాటించే పాఠశాలల్లోనే! కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం హిందీని వ్యతిరేకిస్తే, రాష్ట్రంలోని ఎస్సీలు/ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారు. ఎం దుకంటే స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 80ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి.హిందీ నేర్చుకుంటేనే దేశంలోని ఏప్రాంతంలోనైనా మనుగడ సాగించడానికి వీలవుతుంది. ఉద్యోగావకాశాలు దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో, ఇంగ్లీషుతో పాటు హిందీభాష వచ్చినవారు మాత్రమే మంచి ఉద్యోగాలు సాధించగలరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. తమిళనాడులోని ద్రవిడ పార్టీ నాయకులకు ఇది తెలియంది కాదు. అందుకనే వారి పిల్లల్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివిస్తూ పైకి మాత్రం ఓట్లకోసం తమిళభాషాభిమానాన్ని రెచ్చగొడుతున్నారు. నిజం చెప్పాలంటే తమిళనాడులో కూడా చాలామందికి హిందీ తెలుసు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు, ద్రవిడ వాదం చట్రాల్లోనే ఈ పార్టీల మనుగడ వుండటం, తమిళనాడు ప్రజల పురోభివృద్ధికి ఆటంకంగా మారిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
తాజా వివాదానికి కారణం
ఫిబ్రవరి 15న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఒక ప్రకటన చేస్తూ, జాతీయ విద్యావిధానం`2020 (ఎన్‌ఈపీ`2020)ని అమలు చేయని తమిళనాడు వంటి రాష్ట్రాలకు సమగ్ర శి క్షా పథకం కింద నిధుల (రూ.2వేల కోట్లు) మంజూరు సాధ్యంకాదని స్పష్టం చేయడం తాజా వివాదానికి కారణం. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2020 జాతీయ విద్యావిధానానికి తాను వ్యతిరేకమని తమిళనాడులోని డి.ఎం.కె. ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 1968 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ద్విభాషా విధానాన్ని`ఇంగ్లీషు, తమిళం` మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తామని కుండబద్దలు కొట్టడంతో మరోసారి రాష్ట్రంలో భాషా రాజకీయాలు వేడెక్కాయి. దేశం మొత్తంమీద ద్విభాషా విధానాన్ని అనుసరించే రాష్ట్రం కేవలం తమిళనాడు మాత్రమే. మిగిలిన అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయ పార్టీలు 1930 నుంచి త్రి భాషా సూత్రాన్ని తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులోని డి.ఎం.కె. ప్రభుత్వం భాషా విధానంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్నే మరోసారి నొక్కి చెప్పింది. దీంతో కేంద్రం, తమిళనాడు మధ్య విద్యావిధానం విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. డిఎంకే ప్రభుత్వం కేంద్రంపై విరుచు కుపడటంలో రెండిరటి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ కేవలం నిధులకోసం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని, కేంద్రం ఒత్తిళ్లకు తలగ్గేది లేదంటూ తెగేసి చెప్పారు. ఆయన ఇంకా ముందు కెళ్లి తమిళనాడు రాష్ట్రం కేంద్రానికి పన్నులు చెల్లించకపోతే ఏమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకోండంటూ ఘాటుగా హెచ్చరించారు కూడా! కేంద్రం రూ.10వేల కోట్ల నిధులు తమిళనాడుకు ఇస్తామని చెప్పినా తాము త్రిభాషాసూత్రం అమలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం ఎన్‌ఈపీ`2020ను అమల్లోకి తేవడం ద్వారా విద్యార్థులను చదువులకు దూరం చేస్తుందని పేర్కొన్నారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పుడు అమలు చేస్తున్న నీట్ విధానం వల్ల ఎంతోమంది విద్యార్థులకు సీట్లు దొరకక విద్యకు దూరమవుతున్నారని, ఎన్‌ఈపీని అమల్లోకి తెస్తే ఆర్ట్స్‌మరియు సైన్స్ కోర్లుకు కూడా ఎంట్రెన్స్ పరీక్షలు పెడతారని అప్పుడు మరింత మంది విద్యార్థులు తప్పనిసరిగా విద్యకు దూరంకావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు. కాకపోతే హిందీని రుద్దాలనుకుంటే ఒప్పుకోం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులను ఇది స్కూళ్లకు దూరం చేస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ విధానం కిందమూడు, ఐదు, ఎనిమిది తరగతుల స్థాయిల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్‌లు ప్రవేశపెడతారు. దీనివల్ల ఎంతోమంది ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు చదువు అందుబాటులో లేకుండా పోతుందన్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఒక్క భారతీయ జనతాపార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ద్విభాషా సూ త్రానికే మద్దతునిస్తున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో పోటీపడాలంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాల్లో కూడా హిందీ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర బీజేపీ వాదిస్తోంది. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం దారుణమైన తప్పిదమని కూడా పార్టీ భావిస్తోంది. ము ఖ్యంగా ఈవిధానంలో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న అంశం ఎక్కడాలేదన్న సంగతిని గుర్తు చేస్తోంది.
మొట్టమొదటి హిందీ వ్యతిరేక ఉద్యమం
తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొట్టమొదటిసారి 1937లో ప్రారంభమై 1940 వర కు కొనసాగింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి, హిందీ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడం ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. అప్ప ట్లో ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్, ద్రవిడవాద సిద్ధాంత కర్త పెరియార్‌లు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఆందోళన సందర్భంగా 1271మంది నిరసన కారులను అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లల్లో పెట్టింది. నాటి ప్రెసిడెన్సీ గవర్నర్ లార్డ్ ఎర్‌స్కైన్ ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఆందోళన కారు లు తమ ఉద్యమాన్ని విరమించారు. స్వాతంత్య్రానంతరం 1948 కేబినెట్ మంత్రి ఒమండూర్ రామస్వామి రెడ్డి హిందీభాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడం రాష్ట్రంలో రెండోసారి హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారితీసింది. ఆ తర్వాత 1963లో కేంద్రం తీసుకొచ్చిన అధికారిక భాషా చట్టం నేపథ్యంలో మళ్లీ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఆందోళన చెలరేగి 1964`65 మధ్య కాలంలో ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందంటే దాదాపు అరడజను మంది ఆందోళనకారులు తమను తాము సజీవదహనం చేసుకోవడమే కాదు, నిరసన లు హింసాత్మకంగా మారడంతో ఇద్దరు పోలీసులతో సహా 60మంది మరణించారు. తర్వాత కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి, చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణస్థితికి చేరుకున్నాయి.
త్రిభాషా సూత్రం
1968లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన త్రిభాషా విధానం (హిందీ, ఇంగ్లీషు మరియు ఏదైనా ప్రాంతీయ భాష) దేశంలోని అన్ని రాష్ట్రాలు మూడుభాషలను అమలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఒక్క తమిళనాడు మాత్రం కేవలం ద్విభాషా విధానానే అమలు చేయడానికి నిర్ణయించింది. అప్పటి మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి అన్నాదురై మాట్లాడుతూ తమిళులు ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఇంగ్లీషు భాష సరిపోతుంది. హిందీ అవసరం లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈమేరకు ఆయన 1968 జనవరి 23న రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనిపై మూడురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు త్రిభాషా సూత్రాన్ని అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. అప్పటినుంచి రాష్ట్రంలో ద్విభాషా సూత్రాన్నే అమలు చేస్తున్నారు. అయితే తమిళనాడులోని సి.బి.ఎస్.సి. స్కూళ్లలో మాత్రం హిందీని కూడా బోధించడం కొనసాగుతూ వస్తోంది.
ఎన్‌ఈపీా2020
2020లో కేంద్రంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చింది. తమ పూర్వ ప్రభుత్వాల మార్గాన్నే అప్పటి ఏ.ఐ.డి.ఎం.కె. ప్రభుత్వం అనుసరిస్తూ, తమకు త్రిభాషా సూత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ విద్యావిధానంలో కేంద్రం మూ డు భాషల్లో ఒకటి ఏదైనా ప్రాంతీయ భాష కూడా వుండాలని స్పష్టం చేసినా, ఏ.ఐ.డి.ఎం.కె. ప్రభుత్వం మాత్రం ఏదోవిధంగా హిందీని రుద్దడానికి మాత్రమే కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకితెచ్చిందని విమర్శించింది. జాతీయ స్థాయిలో ఏకీకృత జాతీయ విద్యావిధానం ఉమ్మడి జాబితా లో ఉండటం కూడా తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. ముఖ్యంగా ఈ విద్యావిధానంలో నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను కేంద్రం ప్రతిపాదించింది. ఒక విద్యార్థి మధ్యలో బయటకు రావడానికి ఇందులో బహుళ ఐచ్ఛిక మార్గాలున్నాయి. ఇవి డ్రాపౌట్లకు దారితీస్తాయని భావించడం కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. ముఖ్యంగా ఈ విధానంఅట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎంతమాత్రం అనుకూలం కాదని కూడా తమిళనాడు ప్రభుత్వం విస్పష్ట అభిప్రాయం. త్రిభాషా సూత్రంపై తాజా వివాదం నేపథ్యంలో ఫిబ్రవరి 23న తమిళభాష వీరాభిమానులు రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి బోర్డులపై ఉన్న హిందీ భాషపై నల్లటి రంగును పూయడం ‘వెర్రికి వేయి తలలన్న’ సత్యాన్ని మరోసారి నిజం చేసింది.
హిందీ ఉమ్మడి భాష
విశ్వహిందూ పరిషత్ ప్రస్తుత వివాదంపై అన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళం భారతీ య భాషల్లో ఒకటి. అయితే హిందీభాష దేశవ్యాప్తంగా ప్రజలమధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. దేశం ఉమ్మడిగా పురోగతిలో ముందుకు సాగుతున్నప్పుడు, ‘ప్రత్యేకత’ పేరుతో తమిళనాడును ప్రధాన స్రవంతినుంచి వేరుచేయవద్దని కోరింది. ప్రస్తుతం ఎన్‌ఈపీ`2020పై కేంద్రం, తమిళనాడుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఈవిధంగా స్పందించింది. డీఎంకే ప్రభుత్వం సంస్కృత భాషను గుడ్డిగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమేనని వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ విమర్శించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ ఎన్‌ఈపీ`2020 కేవలం త్రిభాషా సూత్రాన్ని మాత్రమే ప్రతిపాదించింది. ఇందులో హిందీని త ప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదన్న సత్యాన్ని గుర్తించాలి. ఈ అంశాన్ని దాచిపెట్టి డీఎంకే రాజకీ య లబ్దికోసం తప్పుడు ప్రచారం మానుకోవాలని కూడా ఆయన కోరారు.