శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ శంభునిపేట కరెంట్ సబ్ డివిజన్ ఆఫీసులో
మంగళవారం నాడు లైన్మెన్ దినోత్సవ సందర్భంగా మల్లికార్జున్ డీఈ, చంద్రమౌళి ఏడిఈ ల ఆధ్వర్యంలో, సబ్ డివిజన్ పరిదిలోని శంభునిపేట, కరీమాబాద్, మామునూర్ సెక్షన్ల విద్యుత్ సిబ్బందికి, విద్యుత్ భద్రత నియమాలపై, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుట గురించి, వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే వేసవికాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేసవికి ముందే లైన్లు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని నిర్వహణ చేసుకొని రాబోవు వేసవిలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరికీ భద్రతా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు సిబ్బంది అందరికి లైన్ మెన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రవి, సంపత్, సురేందర్ మరియు సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.