నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు…..??
సర్వే చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంకా చెల్లించని రెమ్యూనరేషన్..!!!
చెల్లించినట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన
సర్వేలో ఒత్తిడి పెంచిన అధికారులు – రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం
అధికారుల తీరు సరికాదు
రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:
మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో సర్వే రెమ్యునరేషన్ చెల్లింపు జాప్యం పై నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొన్న ఉద్యోగ ,ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో సర్వే పూర్తి చేయుటకు గాను ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. సర్వే పూర్తయిన వెంటనే ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని వివరించారు .కానీ అధికారులు నేటికీ ఉద్యోగ ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించలేదని విమర్శించారు. సర్వే త్వరగా పూర్తి చేయాలని ప్రతిరోజు తీవ్ర వత్తిడి తెచ్చిన అధికారులు రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం ఎందుకింత జాప్యం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా సర్వే రెమ్యూనరేషన్ చెల్లించినట్లుగా అసెంబ్లీలోనే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రెమ్యూనరేషన్ సత్వరమే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు కార్యదర్శి వీసం నరసయ్య ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఏ.రమాదేవి, ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ , అప్పాల నాగరాజు , ఎం . నరసింహస్వామి, సురేష్ కుమార్ , భూక్య శ్రీనివాస్, టీ బీ విజయ్ లు పాల్గొన్నారు.