రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు.

water

మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు

– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

– మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ

కోనరావుపేట/సిరిసిల్ల(నేటి ధాత్రి):
మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి ని ఆరా తీయగా, ఈ రోజు 0.75 టీ ఎం సీ ల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

water
water

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే.. దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్ట్ పరిధిలో పంటలు వేసిన రైతులు సాగు నీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రాజెక్ట్ లో నీటి నిలువలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!