ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.