మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
జహీరాబాద్. నేటి ధాత్రి:
మాదిగ అమర వీరుల దినోత్సవం సందర్బంగా ఐబీలో ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఇంచార్జి ఆధ్వర్యంలో ఘనంగా అమరవీరుల చిత్ర పటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…తరతరాలుగా అణిచివేయబడిన కులాలు చైతన్యమై వారి హక్కుల కొరకు ఉద్యమాలు మొదలై వారి అస్తిత్వ పునాదులను నిర్మించుకునే ఈ ప్రక్రియలో జరుగుతున్న పోరాటమే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమం లక్ష్య సాధనలో భాగంగా 2009 ఫిబ్రవరి 28న గాంధీభవన్ ఘటనలో వీరమరణం పొందిన అమరులు పొన్నాల సురేందర్ మాదిగ,మహేష్ మాదిగ,దేవేందర్ మాదిగ,ప్రభాకర్ మాదిగ,గత పోరాటంలో వీర మరణం పొందిన తెల్ల బండ్ల రవి అదే ఉద్యమ ప్రస్థానంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ప్రాణాలర్పించిన దర్శనలా భారతి మాదిగ గార్లు వర్గీకరణ సాధనలో వారి త్యాగం మరువలేనిది.
స్వాతంత్ర మరియు తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరుల తీరుగానే మాదిగ జాతి కొరకు
ఈ సమాజంలో మార్పు కొరకు జరిగిన అనేక ఉద్యమాలలో పాలుపంచుకొని ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలు స్మరించుకుంటూ
దేశ ,రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనగా మార్చి 1న మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
జరుపుకోవడం జరుగుతుంది.భవిష్యత్తులో జరగబోయే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయం దిశగా ముందుకు సాగాలని దానికి సబ్బండ వర్గాలు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో… జైరాజ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు,కే నవీన్ కుమార్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి, టీంకు జహీరాబాద్ ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు ,మండల ప్రధాన కార్యదర్శి సుకుమార్, చంద్రయ్య మాజీ సర్పంచ్ మామిడిగి, నర్సిoములు,ప్రభాకర్, నిర్మల్, అజయ్, కిట్టు, అనిల్, సుందర్, జీవన్,ప్రశాంత్, లాజర్, కర్నె శ్రీనివాస్ పాల్గొన్నారు.