చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.
స్మశానవాటికకు పోకుండా దారి కబ్జా చేశారు.
ద్వారకపేట గ్రామస్తుల అవేదన..
విలువైన మత్తడి వాగు కబ్జా.. కథనంపై గ్రామస్తుల పిర్యాదుల వెల్లువ..
ఆర్డీఓ కార్యాలయం,ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు మత్తడి వాగుకు సంబంధించిన వాగుభూమిని కబ్జా చేసి వే బ్రిడ్జి నిర్మించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ పరిధిలో గల 17 వార్డు ద్వారకపేట గ్రామస్తులు ఆరోపించారు.అలాగే మా గ్రామానికి సంబంధించిన స్మశానవాటిక
కు వెళ్ళే దారి భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకొని మా భూములను కాపాడాలని వేడుకుంటూ అలాగే ఇటీవల ‘విలువైన మత్తడి వాగు కబ్జా.. ఆపై వే బ్రిడ్జి నిర్మాణం” అనే నేటిధాత్రి దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామస్తులు శుక్రవారం నర్సంపేట ఎమ్మార్వో రాజేష్,మున్సిపల్ కమిషనర్ కు వేరు వేరుగా పిర్యాదులు చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ

ద్వారకపేట పరిధిలోని ఎంఎఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర గల కాలువ ఆక్రమునకు గురికావడం జరిగిందని దీంతో 17వ వార్డు ఎస్సీ కాలనీ సంబంధించిన ఇండ్లు కాలువ వరదకు గురైతున్నదని ఆరోపించారు. కాలువకు ఆక్రమణకు కారకులైన వారిపై తక్షణ చర్యలు తీసుకొని కాలువపైన అక్రమంగా నిర్మాణం చేసిన పైపులైన్లను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.మరియు ద్వారకపేట ఆరో వార్డు, 17వ వార్డు వద్దగల స్మశానవాటికకు సంబంధించిన దారిభూమిని కబ్జాచేశారని దీంతో ప్రజలను దాన సంస్కరాలకు పోనీయకుండా పత్తిమిల్లు యజమాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.స్మశాన వాటికకు సంబంధించిన దారిభూమిని
కబ్జా చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సి కాలని వాసులు,గ్రామస్తులు డిమాండ్ చేశారు.వెంటనే స్పందించిన ఎమ్మార్వో రాజేష్ వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు వేల్పుల మల్లయ్య, వేల్పుల శ్రీనివాస్, వేల్పుల భాస్కర్, పొన్నాల వీరస్వామి,పొన్నాల ఎల్ల స్వామి, ఇస్రాం బాబు,చింత సాంబయ్య, ఓరుగంటి నాగరాజు, ఆవుల వెంకట నరేందర్ తెలిపారు