పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు.

Amara Veera

మాదిగ అమరుల త్యాగాల ఫలితమే ఏ. బి. సి వర్గీకరణ
– పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఐనవోలు మండల ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం ఐనవోలు మండల కేంద్రంలో ఎం.ఆర్. పి. ఎస్. ఐనవోలు మండల అధ్యక్షులు చింత అశోక్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల నారాయణ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్ల పాటు జరిగిన సుధీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోరకై అమరులైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకుల ప్రాణ త్యాగాలు మరువలేనివి అని కొనియాడారు. వారి త్యాగాలే దండోరా ఉద్యమాన్ని తెలుగు గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు వర్గీకరణ ఉద్యమం సాగేలా మాకు స్ఫూర్తినిచ్చాయన్నారు. అందుకే మార్చి ఒకటిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల గ్రామ కేంద్రాలలో మాదిగ జాతికి వర్గీకరణ ఫలాలు అందించేందుకు తమ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే మార్చి 1వ తేదీన మండలం లోని అన్నిగ్రామాల్లో ఎవరికి తోచిన విధంగా వారు అమర వీరుల పేరిట పేదలకు అన్నదానాలు,మరియు పళ్ళపంపిణ చేసి పేదలకు అందించవలసిందిగా అయన కోరారు. అలాగే ఈ వర్గీకరణ అమరుల త్యాగం వలన వచ్చినదని ఈ సమావేశాలలో అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన వర్గీకరణ మన బిడ్డల వంద తరాల భవిష్యత్తు నిర్మాణం జరిగినదని జాతి మొత్తానికి వివరించాలని తెలిపారు. అంతేగాకుండా ఈ వర్గీకరణలో మాదిగలకు మరియు కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగినందున ఎస్సీ కమిషన్ రిపోర్టులోని లోపాలను సరిచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సుదీర్ఘ కాలం చేసిన కృషి తపన,త్యాగాల వలన పోరాటాలు వలన వచ్చినదని, మాదిగ, మాదిగ ఉపకులాల బిడ్డలకు సవివరంగా తెలియజేయాలని ఎమ్మార్ పిఎస్ నాయకులను నారాయణ కోరారు. ఈ సమావేశానికి మండల ప్రధాన కార్యదర్శి బరిగెల ఏలియా మాదిగ హనుమకొండ జిల్లా నాయకులు, కట్కూరి రమేష్ మాదిగ మండల అధ్యక్షుడు బాబు మాదిగ బరిగల ఆరోగ్యం మాదిగ మరుపట్ల దేవదాస్ మాదిగ బర్ల బాబు మాదిగ కొండపర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్కూరి విష్ణు మాదిగ బి. ప్రభాకర్ మాదిగ బి.కుమార్ మాదిగ బొక్కల రాజు మాదిగ ఏ.మహేష్ మాదిగ శ్రీను మాదిగ చేరాలు మాదిగ రమేష్ మాదిగ ఆనందం మాదిగ బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!