
Election of Construction Workers Union
తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక.
బెల్లంపల్లి నేటిధాత్రి :
ఈ రోజు బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో, తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ Regd no: 2829 ఏఐటీయూసీ అనుబంధం మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి పోశం. ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ పట్టణ హడక్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది, బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ గా కొంకుల రాజేష్,బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ గా ఆవునూరి రాజయ్య, కోకన్వీనర్ గా చిప్పకుర్తి బాపు, కో కన్వీనర్‌గా రామగిరి వెంకటి, లను ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, నాయకులు రత్నం రాజం, మామిడి గోపి, సభ్యులు కంపెల్లి నారాయణ, దేవునూరి కిషన్, లింగంపల్లి రాజలింగం లు పాల్గొన్నారు.