కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు
జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రమైన ప్రభుత్వ మాడల్ స్కూల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్న సిద్దు,మాస్టర్ బ్లాక్ బెల్ట్ తార్దన్. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.కరాటే క్లాసులు ప్రభుత్వ వేతనంతోనే మూడు నెలల పాటు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు కొనియాడారు. విద్యార్థులకు విద్య, క్రీడలతో పాటు కరాటే తప్పనిసరి అన్నారు. కరాటే తో ప్రయోజనాలు తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల మధ్య ఘర్షణ చోటు చేసుకునే సమయంలో, ఎదుటి వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు మనం కరాటే విద్య నేర్చుకుని ఉంటే ఎదుటి వ్యక్తులను సైతం కాపాడవచ్చు అని అన్నారు. రక్షణ లేని సమయంలో పోలీసులకు సందేశం వెళ్లిన పోలీసులు రావడానికి సమయం పట్టిన తనను తాను కాపాడుకోవడానికి ఇతరులను కాపాడానికైనా నేటి సమాజంలో రేపటి భవిష్యత్తుకు ప్రతి ఒక్క విద్యార్థికి కరాటే చాలా ముఖ్యమని అన్నారు.