నీటి కాలువను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం నుండి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సాగునీరు వచ్చే కెనాల్ కొందరు భూ యజమానుల అభ్యంతరాల వల్ల నీళ్లు రావడంలేదని రైతాంగానికి ఇబ్బంది అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశానుసారం కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించి ఎలాగైతే అడవి శ్రీరాంపూర్ రైతాంగానికి సాగునీరు ఇవ్వగలుగుతాము అని చూసి ఇట్టి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి మరియు ఉన్నతాధికారులకు తీసుకువెళ్లడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కారం చేయవలసిందిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సధానందం మద్దెల రాజయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, గాదం శ్రీనివాస్ ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూటు రఫీ ,ముత్తారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనుము సమ్మయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ తదితరులు పాల్గొన్నారు