బాధిత కుటుంబానికి కోగిల బ్రదర్స్ ఆర్థిక సాయం
పరకాల:నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన కొగిల అరవింద్ గత కొద్దిరోజులకిందట రైలు ప్రమాదానికి గురై తన రెండు కాళ్ళు విరగడం జరిగింది.దీన స్థితిలో ఉన్నా ఆ కుటుంబానికి కోగిల బ్రదర్స్ మరియు ఏపిఆర్ సేన ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి పదివేల(10,000)రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్బంగా కోగిల అర్జున్ మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయాల వలన కుటుంబం రోడ్డునపడే పరిస్థితి ఏర్పడుతుందని కావున ప్రతి ఒక్కరు బాధ్యాయుతంగా మెలిగి చదువులో ఉన్నత శికరాలకు చేరాలని అన్నారు.సహకారం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిక్షపతి, సుధాకర్,అర్జున్,కిరణ్,లడ్డు,సాయి,సంపత్,బబ్లు,చంటి,దయ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.