ఢల్లీి, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్
రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్
ఎన్నికలకు ఏడాదిముందే వ్యూహాత్మక అడుగులు
తృణమూల్ సాంస్కృతిక మూలాలపై విమర్శలు
హిందువులను ఏకీకృతం చేసేందుకు యత్నాలు
తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిన ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటన
హిందువులపై వివక్షను హైలైట్ చేస్తున్న బీజేపీ
శాఖలు పెంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో విస్తరణకు ఆర్ఎస్ఎస్ యత్నాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌ల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాల తో కమలనాథుల్లో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు ‘ఆపరేషన్ బెంగాల్’ను బీజేపీ మొదలుపెట్టిందా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా కొరకరాని కొయ్యగా ఉన్న పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలన్నది వారి ప్రస్తుత లక్ష్యం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, పశ్చిమ బెంగాల్లో 18 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించగా, ఆ ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు చేసిన విస్తృత ఫలితాలనిచ్చి 2021 అ సెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లలో గెలుపు సాధించడానికి దోహదం చేసింది. ఒకప్పుడు మమతా బెనర్జీకు కుడిభుజంగా వ్యవహరించిన సుబేందు అధికారి, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడిరచి ఈ ప్రాంతంలో తన బలమేంటో నిరూపించారు. ప్రస్తుతం భాజపా పశ్చిమ బెంగాల్లో గెలుపు సాధనకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇప్పుడు పూర్తిగా ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో, మమత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, అరాచక పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న యోచనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగు తోంది. గత ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ గణనీయంగా కృషిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తన శాఖలను మరింత విస్తరించుకొని, బీజేపీ బలహీనంగా వున్న ప్రాంతాల్లో పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఏర్పాటుచేసేందుకు తనవంతు కృషిని మొదలుపెట్టింది.
ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించడంతో, పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖలో జోష్ కనిపిస్తోంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాలవల్ల ఆప్ అధికారాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర నేతలుఒకపక్క విమర్శిస్తుంటే, ఆప్‌కు మద్దతిచ్చిన తృణమూల్ కాంగ్రెస్ మౌనంగా వుండటం గమనా ర్హం. ఢల్లీి ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ గెలుపునకు ఉత్తేజాన్నిస్తాయని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో 213 సీట్లను కైవసం చేసుకొని తృణమూల్ కాంగ్రెస్ తన కోట ఎంత పటిష్టంగా వున్నదీ తెలియజెప్పింది. ఇక కుంభమేళాను ‘మృత్యు కుంభ్’ అంటూ మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారి భగ్గుమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మమతా బెనర్జీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ నాయకులు సుబేందు అధికారి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించడం తాజా పరిణామం. ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం సందర్భంగా జరిగిన గందరగోళంలో బీజేపీ నాయకు డు, విపక్షనేత సుబేందు అధికారితో సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను 30రోజుల పాటు స్పీ కర్ సస్పెండ్ చేశారు. వరుస పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులు తృణమూల్ కాంగ్రెస్ పై తమ దాడులను క్రమంగా తీవ్రం చేస్తున్నారన్న అంశం స్పష్టమవుతోంది. తృణమూల్ సాం స్కృతిక, మతపరమైన మూలాల నేపథ్యంలో భాజపా నాయకులు హిందువుల హక్కులను పరిర క్షించేది తమ పార్టీమాత్రమేనన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మరింత చురుగ్గా తృణమూల్‌పై విమర్శల దాడులను ముమ్మరం చేస్తారని తాజా పరిణామాలు స్ప ష్టం చేస్తున్నాయి.
ఇటీవల హిందువులు నిర్వహించే సరస్వతీ పూజపై తృణమూల్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం తో, హిందువులపట్ల ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ నేతలు విపరీతం గా ప్రచారం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులు, వీరికి వ్యతిరేకంగా నెరపే రాజకీ యాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఏడాది కాలంలో తృణమూల్‌ను బలమైన ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ముందుకెళుతోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీ రాజకీయాలను ఎదుర్కొనేందుకు తమది ‘సెక్యులర్’ ప్రభుత్వమని ప్రచారం చే స్తోంది. శాంతిభద్రతల విషయంలో మతం పేరుతో చూసీ చూడనట్టు వుండలేమని స్పష్టం చే స్తోంది.
రంగంలోకి ఆర్ఎస్ఎస్
మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై తన దృష్టిని కేంద్రీకరించిందన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా సంస్థ అధినేత మోహన్ భాగవత్ ఫిబ్రవరి 15వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ పట్టణంలోని తాలిత్ రాయ్ కాంప్లెక్స్‌లో జరిగిన సంస్థ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, ఆర్ఎస్ ఎస్‌లో సభ్యులుగా చేరాలంటూ కొత్తవారికి పిలుపునివ్వడం రాష్ట్రంలో సంస్థను మరింత విస్తరించడం ద్వారా హిందువులను మరింత సుసంఘటితం చేయాలన్న ఉద్దే శం స్పష్టమవుతోంది. ‘బయట వుండి మమ్మల్ని పరిశీలిస్తే మీలో తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు. అందువల్ల సంస్థలో చేరండి. ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఇక్కడి కార్యకలాపాలను పరిశీలించి నచ్చితే కొనసాగండి లేకపోతే వెళ్లిపోవచ్చు’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. హిందూ సమాజంలో ఆత్మీయతను పెంపొందించడం, వారిని ఏకతాలిపై నడపడమే ఆర్.ఎస్.ఎస్. ప్రధాన లక్ష్యమని ఆయన అ న్నారు. బయటనుంచి అభిప్రాయాలు ఏర్పరచుకునేదానికంటే సంస్థతో సాన్నిహిత్యాన్ని పెంచు కోండి. అప్పుడు మీకు సంస్థ అంటే ఏంటో అర్థమవుతుందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో 70వేల ఆర్ఎస్ఎస్ శాఖలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సంస్థ బలహీనంగా వున్న ప్రాంతాల్లో శాఖలను నెలకొల్పడం ద్వారా ప్రజల్లోకి మరింతంగా విస్తరించాలన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంతేకాదు ఈసారి ఆయన పది రోజుల పర్యటన వ్యూహాత్మకంగా సాగింద నుకోవాలి. ఎందుకంటే 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం వెనుక క్షేత్రస్థాయిలో చాలా ముందునుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అకుంఠిత కృషి దాగివున్నదన్న ది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ఏడాది ముందునుంచే బెంగాల్లో తన వ్యూహాలను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ అడుగులు ముందుకేస్తున్నట్టు అవగతమవుతోంది. ముఖ్యంగా దక్షిణ పశ్చిమబెంగాల్ ప్రాంతంలో బలంగా వున్న తృణమూల్ కాంగ్రెస్ మూలాలను దెబ్బకొట్ట గలిగితే బీజేపీ అవలీలగా అధికారంలోకి రాగలుగుతుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఈ ప్రాంతంపై నే దృష్టికేంద్రీకరించి, తన శాఖలను మరింత విస్తరించి ఇప్పటినుంచే క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు పరచాలని చూస్తోంది.
ఆర్ఎస్ఎస్ సభను అడ్డుకోవడానికి విఫలయత్నం
ఆర్ఎఎస్ఎస్ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన మమతా బెనర్జీ ప్రభుత్వం బర్థమాన్లో మోహన్ భాగవత్ నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతినివ్వలేదు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు జరుగతున్నందున, మైకులు, లౌడ్‌స్పీకర్ల వల్ల విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడుతుందన్న నెపంతో జిల్లా యంత్రాంగం ఈ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆర్ఎస్ఎస్ హైకోర్టును ఆశ్రయించడంతో, ‘ఆదివారం కావడంవల్ల పిల్లలకు ఏవిధమైన ఇబ్బంది ఏర్పడదని’ పేర్కొంటూ షరతులతో కూడిన అనుమతిని మంజూరుచేసింది. హైకోర్టు అనుమతివ్వడం తృణ మూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బగానే పరిగణించాలి. ఇదిలావుండగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భాగవత్ పర్యటన కేవలం రొటీన్‌గా జరిగేదే అని చెబుతున్నప్పటికీ, పొరుగున్న వున్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ, బాంగ్లా సరిహద్దుల వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త తల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తన ఉనికిని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్నది. ఇందుకోసం గ్రామపంచాయతీల స్థాయిలో తమ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా మరింత బలోపేతం కావాలని సంఫ్‌ు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
పొరుగున బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఇస్కాన్‌కు చెందిన స్వామీజీ అరెస్ట్, హిందువులపై, వారి ప్రార్థనా మందిరాలపై దాడులు పెరగడంతో పశ్చిమ బెంగాల్లో ఆర్ఎ స్ఎస్ నేతృత్వంలో పలు నిరసన ర్యాలీలు గతంలో జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీన మోహన్ భాగవత్ ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించడం గమనార్హం. గత అక్టోబర్ నెలలో ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనపై స్పందిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్థులను కాపాడటానికి యత్నిస్తున్నదంటూ విమర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలకు చెందిన కార్యకర్తలతో ఆయన సమాలోచనలు జరిపారు. అంతేకాదు బెంగాల్, బిహార్, సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు చెందిన సంఘ సీనియర్ కార్యకర్తలతో కూడా ఆయన చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. బర్ధమాన్ పట్టణంలోని ఉల్లాష్లో ఫిబ్రవరి 14న మధ్యప్రాంత ఆర్ఎస్ఎస్ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే జిల్లాలోని పుర్బాలోని శాఖను ఆయన సంద ర్శించారు.
మోహన్ భాగవత్ పర్యటన బెంగాల్లో ఆర్ఎస్ఎస్ను మరింత విస్తరించేందుకు దోహదం చే స్తుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. బంగ్లా సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో హింసా రాజకీయాలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ పీఠం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏవిధంగా పావులు నడుపుతుందో వేచి చూడాలి. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ వ్యూహాలు ఫలించి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాయన్న సంగతి మరువకూడదు! అందుకనే మోహన్ భాగవత్ బెంగాల్ పర్యటనకు అంతటి ప్రాధాన్యత!