సంగారెడ్డి కాంగ్రెస్ సారథిగా… ఉజ్వల్ రెడ్డి?

■డీసీసీ అధ్యక్షుడిగా నియమించేలా అధిష్టానం కసరత్తు

” దాదాపుగా ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటన

■జిల్లా కీలక నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్ణయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా పగ్గాలు డాక్టర్ సిద్ధంరెడ్డి ఉజ్వల్ రెడ్డికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. అధి కారికంగా ప్రకటించడమే మిగిలినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా దిన్నర కావొస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇచ్చేలా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉజ్వల్ రెడ్డిని నియమిం చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో వైద్యుడిగా సేవలు!

జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లికి చెందిన సిద్దం రెడ్డి ఉజ్వల్ రెడ్డి కొన్నేళ్లుగా అమెరికాలో వైద్యుడిగా సేవలందిస్తూ వచ్చారు. మరోవైపు ఉజ్వల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు న్నారు. పన్నెండేళ్లుగా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో తన ట్రస్టు ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా వివిధ పోటీలనూ నిర్వహిస్తుంటారు.
వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది. ఉజ్వల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి గతంలో జహీరా బాద్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానూ కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా సారథిగా ఆయనను నియమించేలా కసరత్తు పూర్తయింది.

కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వడంతో!

నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షు రాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తర్వాత ఆమెకు టీజీఐఐసీ చైర్ పర్సన్ గా అవకాశం
ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టీజీఐఐసీ కార్పొరేషన్
ఛైర్ పర్సన్ తో పాటు జిల్లా అధ్యక్షురాలిగానూ
కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఉజ్వల్ రెడ్డిని
సారథిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నించారు. చివరకు పార్టీ అధిష్టానం సురేష్ షెట్కార్ వైపే మొగ్గింది. ఈ క్రమంలో ఉజ్వల్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!