– పాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల/వేములవాడ(నేటి ధాత్రి):
వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ డెయిరీ ప్లాంట్ కు సరైన అనుమతులు లేకపోవడంతో, ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా తాత్కాలికంగా మూసివేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
పరిశ్రమల శాఖ నుండి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారి అనుమతులు, రెవెన్యూ శాఖ నుండి ల్యాండ్ కన్వర్జేషన్ అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి అనుమతులు, మున్సిపల్ శాఖ అనుమతులు మొదలగు లేనందున తాత్కాలికంగా కరీంనగర్ డెయిరీని తాత్కాలికంగా మూసి వేయడం జరిగిందని తెలిపారు.
వేములవాడ టౌన్ ప్లానింగ్ అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేయగా, వాటిని తీసుకోవడానికి నిరాకరించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లా లోని పాడి రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా విజయ డెయిరీ ఆద్వర్యంలో అధిక ధరకు పాలను సేకరించడం జరుగుతుందని వివరించారు. పాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 8341031867, 9121160538, 9398684240 సెల్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.