నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు..తుమ్మలపెల్లి సందీప్
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 16నుండి 18వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఓ రిసార్ట్ లో జరిగిన సోనియమ్మ కుటీరం యువ క్రాంతి బునియాది శిక్షణ తరగతుల సమావేశానికి సందీప్ హాజరైనారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాకు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశాన్ని కల్పించి, మూడు రోజుల పాటు హైదరాబాదులో జరిగిగే శిక్షణ తరగతుల్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని అందించిన జనహృదయనేత, నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ చాలా కీలకమని యూత్ కాంగ్రెస్ లో ఎవరైతే క్రియాశీలకంగా సమర్థవంతంగా చురుగ్గా పని చేస్తారో వారికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉన్న చాలా మంది ప్రముఖులు యూత్ కాంగ్రెస్ లో పని చేసిన వారేనని శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మాట్లాడిన మాటలని ఆయన గుర్తు చేశారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజా పాలన అందిస్తున్న పథకాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా యూత్ కాంగ్రెస్ నాయకులు అడుగులు వేయాలని సూచించారు.జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సురభి దివెది జీ, జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సైద్ ఖాళీద్ అహ్మద్ జీ, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిల చేతుల మీదుగా శిక్షణ తరగతుల సర్టిఫికెట్, యూత్ కాంగ్రెస్ బ్యాగ్, బహుమతులను తీసుకున్నట్లు తుమ్మలపెల్లి సందీప్ తెలిపారు.