దేవరకద్ర /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన డి. వంశీకుమార్ వైద్యం నిమిత్తం హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి సీఎం సహాయ నిధి ద్వారా.. రూ.2 లక్షల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు అయ్యే ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందాలన్నారు.