పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి08:
ఏపీ ఫోరం ఫర్ అంగనవాడి వర్కర్స్, హెల్పర్స్ ,అండ్ మినీ వర్కర్స్ యూనియన్ ప్రధమ వార్షికోత్సవాన్ని పలమనేరు పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సరస్వతి అధ్యక్షతన భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ ప్రథమ వార్షికోత్సవానికి ఆ యూనియన్ చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డివి మునిరత్నం ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏపీ ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రారంభము నుండి కూడా ఇప్పటివరకు తమ యూనియన్ అంగన్ వాడి వర్కర్లు హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యలను ఇప్పటికే అనేక చోట్ల ముందుండి యూనియన్ పరిష్కారం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ ని ఏర్పాటు చేశామని తమ యూనియన్ దోపిడీ, స్వార్థం లేని సహకారం అందించడానికి అంగన్వాడీలను భుజం తట్టి మేల్కొల్పడానికి సిద్ధంగా ఉందన్నారు. అలాంటి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టి తమ యూనియన్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అంగన్వాడి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఆహ్వానించడం శుభ పరిణామం అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రములో అంగన్వాడిలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీలకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా తమ యూనియన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో పిల్లలకు సంబంధించిన జనన ధ్రువ పత్రాలను సకాలంలో పంపిణీ చేస్తే అంగన్ వాడీలు ఆధార్ కార్డులు తీసుకోవడానికి వీలుంటుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకమ్మ నాగరత్న, భాగ్యలక్ష్మి, నిర్మల, మునెమ్మ, కవితమ్మ, శ్రీదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.