చిట్యాల, నేటిధాత్రి
మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక రంగంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రజాపక్షం విలేఖరి కాట్రేవుల ఐలన్న* కు అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో శాలువ తో ఘనంగా సన్మానించి జ్ఞాపిక ను అందించి స్వీట్ తినిపించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు.
శనివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన ప్రజాపక్షం రిపోర్టర్ ఐలన్న* కు సన్మానం చేశారు
ఈ సందర్భంగా పుల్ల మల్లయ్య జన్నే యుగేందర్ సరిగొమ్ముల రాజేందర్ దాసారపు నరేష్ లు మాట్లాడుతూ పత్రిక రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తు చీకటి కోణంలో జరుగుతున్న సంఘటనలు సమస్యలు వెలికి తీసి ప్రజలకు ప్రభుత్వానికి తెలియపరుస్తుంది న్నారు తన కలంతో అనేక కథనాలను విషయాలను రాస్తూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకోవడం గొప్ప విషయమన్నారు ఇలాంటి కథనాలు మరేన్నో వ్రాసి అనేక అవార్డులు మరెన్నో అందుకొని చిట్యాల మండలాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కాట్రేవుల ఐలన్న* ను కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ ప్రముఖ గేయ రచయిత దాసారపు నరేష్ కాళాకారుల మండల అధ్యక్షుడు రజినీకర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గురుకుంట్ల కిరణ్ పాముకుంట్ల చందర్ గడ్డం సదానందం దూడపాక సరోత్తం సరిగొమ్ముల రాజు మొగిలి తదితరులు పాల్గొన్నారు.