నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ మండలం నాగనూలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (58) రోజు మాదిరిగానే.. శనివారం తమ కుల వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తన వ్యవసాయ పొలానికి వెళ్ళాడు. ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టుపై నుండి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో శ్రీనివాస్ గౌడ్ ను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ గౌడ్ కి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.